బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ‘ఏ’ జట్టు భారీ విజయాన్ని నమోదుచేసింది. పాకిస్థాన్ ‘ఏ’తో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తుచిత్తుగా ఓడించింది. భారత బౌలర్ల ధాటికి పాక్ 18.5 ఓవర్లకు 93 రన్స్కే చేతులెత్తేసింది. కెప్టెన్ రాధా యాదవ్ (2/11), సైమా ఠాకూర్ (2/14), ప్రేమ రావత్ (216) తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఛేదనను భారత జట్టు 10.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. దినేశ్ వృంధా (55 నాటౌట్) అర్ధ శతకంతో ఆకట్టుకుంది.