చెన్నై: రెండో టీ20 ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ తమకంటే మెరుగైన జట్లకు షాకులిస్తున్నది. గ్రూప్-ఏలో ఆ జట్టు.. 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచి ఈ టోర్నీలో సమష్టిగా రాణించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 రన్స్ చేసింది.
భారత సంతతి ఆటగాళ్లు సంజయ్ కృష్ణమూర్తి (33 బంతుల్లో 68 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారానికి తోడు మోనాంక్ పటేల్ (30 బంతుల్లో 52, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో నమీబియా 168/6 వద్దే ఆగిపోయింది. స్టీన్‌క్యాంప్ (39 బంతుల్లో 58, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మిత్ (31) పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.