మ్యూనిచ్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సమావేశంలో అవమానం ఎదురైంది. అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి ఒకరు అతడిని ఆపి ఐడెంటిటీ కార్డును చూపించమని అడిగారు.
సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు ఫీల్డ్ మార్షల్ మునీర్, అతని బృందం జర్మనీలోని మ్యూనిచ్ నగరానికి చేరుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను తన ఐడెంటిటీ కార్డు ముందు కన్పించేలా ఉంచమని అక్కడి భద్రతా అధికారి అడుగుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. సమావేశ ప్రవేశ ద్వారానికి అడుగు దూరంలో ఒక భద్రతాధికారి తన నేమ్ బ్యాడ్జీని తట్టి, తన మెడలో వేలాడుతున్న ఐడీ కార్డు వైపు చూపిస్తూ ‘మీరు దానిని తిప్పగలరా?’ అని అడిగారు.