వరంగల్ తహసీల్ వద్ద నిరసన
రెవెన్యూ అధికారులకు వినతిపత్రం
పోచమ్మమైదాన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేతపై పెంచిన జీఎస్టీని రద్దు చేయాలని కోరు తూ అఖిల భారత పద్మశాలి సంఘం, వరంగల్ పట్టణ పద్మశాలి సంఘం, చేనేత సహకార సంఘా ల ఆధ్వర్యంలో వరంగల్ తహసీల్ వద్ద బుధవా రం నిరసన వ్యక్తం చేశారు. కొత్తవాడలోని షత రంజి చేనేత సహకార సంఘం నుంచి తహసీ ల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, రెవె న్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ చేనేత వస్ర్తాలపై 5 నుంచి 12శాతం పెంచాలన్న ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం శాశ్వ తంగా ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప రిశ్రమను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అలా గే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఎఫ్, థ్రిఫ్ట్ ఫండ్ కం సేవింగ్ పథకాన్ని అమలు చేస్తున్నారని వివ రించారు. కేంద్రం తీరు వల్ల చేనేత పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చే శారు. వెంటనే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకు లు ఆడెపు రవీందర్, డీఎస్ మూర్తి, యెలుగం రవిరాజ్, యెలుగం శ్రీనివాస్, యెలుగం సత్యనా రాయణ, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదన య్య, యెలుగం భద్రయ్య, దువ్వల రాజేందర్, అడిగొప్పుల సంపత్, బేతి అశోక్, చిప్ప వెంకటే శ్వర్లు, బేతి సతీశ్, కటకం విజయ్‌కుమార్, జోగు చంద్రశేఖర్, ఆడెపు లక్ష్మి, బేతి కవిత పాల్గొన్నారు.