గేమ్మాస్టర్ ఎవరు?
‘మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో.. ఏం మిస్ అవుతున్నారో అనే విషయాలన్నింటిని నేను గమనిస్తున్నా. ‘ఫలక్‌నుమా దాస్' తీయకముందు నాలో ఓ కసి ఉండేది. ఈ సినిమాకు ముందు అది పదింతలు పెరిగింది. పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉండండి’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ‘కల్ట్'. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు.
‘మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో.. ఏం మిస్ అవుతున్నారో అనే విషయాలన్నింటిని నేను గమనిస్తున్నా. ‘ఫలక్‌నుమా దాస్’ తీయకముందు నాలో ఓ కసి ఉండేది. ఈ సినిమాకు ముందు అది పదింతలు పెరిగింది. పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉండండి’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ‘కల్ట్’. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు.
ఇండియన్ తొలి స్లాషర్ జానర్ (హింస, రక్తపాతంతో కూడిన) మూవీగా వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించారు. శనివారం టీజర్‌ను లాంచ్ చేశారు. గోవా పబ్‌లో పార్టీ హోస్ట్ మొదలుపెట్టే ఓ ప్రాణాంతకమైన ఆటలో ఓ మిత్రబృందం ఎలా చిక్కుకుంది? ఒక్కొక్కరిని హతమారుస్తూ ముందుకుసాగే ఈ కథలో అసలు గేమ్ మాస్టర్ ఎవరు? అతను రక్షకుడా? ప్రమాదకారుడా? అనే ప్రశ్నలతో టీజర్ ఆసాంతం ఉత్కంఠను పంచింది.
ఈ సినిమాలో వందమంది కొత్త నటీనటులున్నారని విశ్వక్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర మాటల రచయిత తరుణ్‌భాస్కర్, సంగీత దర్శకుడు రవిబస్రూర్తో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్సేన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

