దేశంలో ఎక్కడా లేని పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నర్సంపేట, జనవరి5: ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిలుస్తున్న దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్లో ని 92 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 92.10 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం సొంత ఆలోచనలతో అమలు చేస్తున్నారని అన్నారు. ఒక్కో ఆడ బిడ్డ వివాహానికి రూ. లక్షా నూట పదహార్లను అందిస్తున్నా రని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పైసా ఖర్చు లేకుండా పైరవీలు లేకుండా ఎంతో మంది పేదలకు సాయం అం దుతోందని అన్నారు. ఆడపిల్లల వివాహాలు అయిన వెంట నే దరఖాస్తు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, తహసీ ల్దార్ రామ్మూర్తి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రఫీ, ఎంపీడీవో లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన గంగపుత్రులు
నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే పెద్దిని మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకేను అందించారు. గంగపుత్రు లకు వ్యక్తిగత రుణాలతోపాటు కుంటలు, చెరువులు ని ర్మించేందుకు సహకరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కా ర్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి కిసన్, నర్సంపేట అధ్యక్షుడు రావులపెల్లి సమ్మయ్య, ఉపా ధ్యక్షుడు ఎర్రబోయిన కిషన్, చింతల నరేందర్, మెరుగు లక్ష్మణబాబు, మెదరమెట్ల సత్యనారాయణ, పెద్దపెల్లి కేదా రి, జీజుల సాగర్, బయ్య నారాయణ, పూస ఏకాంబ్రం, ఆకుల సుదర్శన్, అంకాల మల్లికార్జున్, చంద్రగిరి దుర్గ స్వామి, కాపురబోయిన వెంకటసమ్మయ్య, కామిని కుమా ర్, సందిరి ప్రశాంత్, పెద్దిపెల్లి శ్రీనివాస్, అంకాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.