ఒమిక్రాన్‌పై ప్రజలకు అవగాహన పెంచాలి
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
ఉపాధ్యాయుల నియామకాల్లో తప్పులు దొర్లద్దు
స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్
ములుగు, జనవరి5(నమస్తేతెలంగాణ): ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో పాటు అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌పై ప్రజలకు అవగాహన పెంచి నివారించేందుకు వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సాంస్కృతిక విభాగం ద్వారా ఒమిక్రాన్‌పై ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల కేటాయింపులో తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రామప్ప ఎఫ్డీఎల్ ఏర్పాటుకు తుది నివేదికలు సమర్పించాలని అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. మత్స్యశాఖ సొసైటీలను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, జడ్పీటీసీలు సకినాల భవాని, తల్లాడి పుష్పలత, పాయం రమణ, కరమ్‌చంద్‌గాంధీ, కోఆప్షన్ సభ్యులు రియాజ్మిర్జా, వలియాబీ, డీఆర్డీవో నాగ పద్మజ, సివిల్ సైప్లె అధికారి అరవిందరెడ్డి, డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, డీపీవో వెంకయ్య, ఎన్పీడీసీఎల్ డీఈ మర్రెడ్డి, సివిల్ సైప్లె డీఎం రాములు, ఎక్సైజ్ ఎస్సై రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.