ఏం ముఖం పెట్టుకొని కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నడు?
కేసీఆర్ గురించి మాట్లాడే నైతికత బీజేపీ నాయకులకు లేదు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపాటు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ, ప్రజాస్వా మ్యం గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అడ్డంగా మాట్లాడుతున్నడు.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎంత ప్రజాస్వామ్యం ఉందో ఎవరిని అడిగినా చెబుత రు. ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాళేశ్వరంపై అవా కులు చెవాకులు పేలుతున్నడు.. ఆయనకు సిగ్గుండాలె’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా, ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అంటున్నాడు.. అవును తెలంగాణా రైతులకు కేసీఆర్ ఏటీఎం లాంటి వాడేనని పేర్కొన్నారు. కేసీఆర్, కాళేశ్వరం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ వాళ్లకు లేదన్నా రు. తెలంగాణకు వచ్చి రంధ్రాన్వేషణ చేసి సమస్యలు వెతుకుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపర్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టి కట్టుకున్న ప్రాజెక్ట్ను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు.