డీఎంహెచ్‌వో శ్రీరామ్
గురుకుల కళాశాలలో విద్యార్థులకు వ్యాక్సినేషన్ పరిశీలన
కాటారం/ గణపురం/ చిట్యాల/ వాజేడు/ వెంకటాపూర్/ గోవిందరావుపేట, జనవరి 4: 15 నుంచి 18 ఏళ మధ్య వయసు వారు నిర్భయంగా టీకా వేయించుకోవాలని డీఎంహెచ్‌వో శ్రీరామ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో వ్యాక్సినేషన్‌ను డీఎంహెచ్‌వో శ్రీరామ్, ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 150 మంది విద్యార్థులకు కొవాగ్జిన్ టీకా వేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కరోనాను తరిమికొట్టేందుకు టీకా ఒక్కటే శ్రీరామ రక్ష అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు రామారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వార్డెన్ రాకేశ్, సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు ఇస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్ పరిశీలించారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న ఒమెక్రాన్ నుంచి కాపోడుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ విజయకృష్ణ, ఉప సర్పంచ్ అశోక్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో వాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ ప్రసన్‌కుమార్ ఆధ్వర్యంలో ఒడితల పీహెచ్సీ వైద్య సిబ్బంది విద్యార్థులకు టీకాలను ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేఖర్, హెల్త్ అసిస్టెంట్ సాంబయ్య, ఏఎన్ఎం సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాజేడు మండలం శ్రీరాంనగర్‌లో నిర్వహిస్తున్న పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు పేరూరు వైద్యాధికారి సీతారామరాజు నరహరి ఆధ్వర్యంలో టీకా వేశారు. కార్యక్రమంలో హెచ్ఎం గొంది విఘ్నేశ్వరరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం పాలంపేట ఉన్నత పాఠశాలలో సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలను వేశారు. ఇన్చార్జి హెచ్ఎం కుమారస్వమి, ఏఎన్ఎం స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోవిందరావుపేటలోని జూనియర్ కళాశాల, చల్వాయిలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చారు. 260 మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ వేసినట్లు వైద్యాధికారిణి తేజశ్రీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరపనేని సాయికుమార్, ప్రధాన కార్యదర్శి నర్సింహానాయక్, సీహెచ్‌వో సదానందం, సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.