రూ.1.20కోట్లు మంజూరు
స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ గోపి
నర్సంపేట, జనవరి 4 నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. మంగళవారం ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శిం చి పరిశీలించారు. ఆస్పత్రికి ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, రూ.1.20కోట్లు మంజూరైన ట్లు వెల్లడించారు. కొవిడ్ బారిన పడిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు హనుమాన్ టెంపుల్ సమీపంలో నిరుపయోగం గా ఉన్న ఆస్పత్రి సిబ్బంది క్వార్టర్స్‌లో ల్యాబ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకు రూ.16 లక్షలు మంజూరైనందున 1500 ఎస్ఎఫ్టీల స్థలం అవసరం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 96 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఐసీయూ బెడ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పిల్లల వార్డు, ఎమర్జెన్సీ వార్డుకు చెందిన 30 బెడ్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఐసీయూ, ఐసొలేషన్‌కు చెందిన 30 బెడ్స్‌ను చూశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ బెడ్స్ ఉన్న గదులను ఆయన పరిశీలించారు. మాట్లాడారు. అనంతరం నర్సంపేటలో బాలికల ఉన్నత పాఠశాల స్థలానికి దొడ్డ మోహన్‌రావు ఇంటిని గతంలో దానం చేయగా పరిశీలించారు. పాఠశాల పక్కనున్న ఐబీ కార్యాలయ స్థలాన్ని పాఠశాలకు అందించి, ఇంటి స్థలాన్ని ఐబీ ఆఫీసుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పాఠశాల, ఐబీ కార్యాలయం నుంచి లేఖలను తనకు పంపాలని కలెక్టర్ సూచించారు. నర్సంపేట ఆర్డీఓ పవన్‌కుమార్, డీఈ రాజశేఖర్, తహసీల్దార్ రామ్మూర్తి, ఆస్పత్రి సూపరిం టెండెంట్ గోపాల్, మనోజ్‌లాల్ పాల్గొన్నారు.