చదువుతో పాటు జననరల్ నాలెడ్జి ముఖ్యం
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి: వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
భూపాలపల్లి టౌన్, జనవరి 4: విద్యార్థులు లక్ష్యంపై గురి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా భూపాలపల్లిలోని ఇందిరా భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. 8,9,10వ తరగతికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థినీ విద్యార్థులకు ‘రైతు బంధుపథకం, కాళేశ్వరం, జలవనరుల ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ అభివృద్ధి’ అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవే ట్ పాఠశాలల విద్యార్థులు హాజరై నిర్ణయించిన అంశాలపై ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, కేజీ టు పీజీ గురుకులాలను ప్రారంభించి కార్పొరేటుకు దీటుగా విద్యనందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో విద్యార్థులు వా రి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని, పథకాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.
భవిష్యత్‌లో పోటీ పరీక్షల్లో ఈ అంశాలపై ప్రశ్నలు ఉంటాయన్నారు. పల్లా బుచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించాలన్నారు. పోటీల్లో అబ్బాయిల విభాగంలో టీ ప్రేమ్‌సాయి (మాంటిస్సోరీ స్కూల్, కాటారం ) ప్రథమ, ఎండీ ఫర్హాన్ (మైనార్టీ గురుకులం, భూపాలపల్లి) ద్వితీయ, అమ్మాయిల విభాగంలో ఎం శివాణి (టీఎస్ డబ్ల్యూఆర్ఎస్, శాయంపేట) ప్రథమ, సహస్ర (మాంటిస్సోరి స్కూల్, భూపాలపల్లి), ఆర్ స్వాతి (జడ్పీహెచ్ఎస్, భూపాలపల్లి) ద్వితీయ, జే సాయిశ్రీ (టీఎస్ డబ్ల్యూఆర్ఎస్, శాయంపేట), టీ కల్యాణి (సెయింట్ పీటర్స్, భూపాలపల్లి) తృతీయ బహుమతులు గెలుపొందారు. అలాగే పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే గండ్ర దంపతులు, పల్లాల బుచ్చయ్య బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీచైతన్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు కొలుగూరి సంజీవరావు, మైనార్టీ గురుకులం ఉపాధ్యాయులు సుధాకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సదానందం వ్యవహరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌యాదవ్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, భక్తాంజనేయస్వామి దేవాలయ చైర్మన్ కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు బుర్ర రమేశ్ తదితరులు పాల్గొన్నారు.