స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 3 : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి రాధి క సూచించారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ రైతు వేదికలో ప్రత్యా మ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఏవో రాధిక హాజరై మాట్లాడారు. కుసుమ, నువ్వులు, వేరుశనగ, పప్పుదినుసులు కంది, నూ నె గింజల పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ పంటల రకాలు, విత్తనాల మోతాదు, విత్తే కాలం, దిగుబడి అంచనా వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ ప్రదీప్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పలస్వామి, రైతు కో ఆర్డీనేటర్ పురమాని ఐలోని, రైతులు పాల్గొన్నారు.
ఇతర పంటలే మేలు
జనగామ రూరల్: వరికి బదులు ఇతర పంట లే వేసుకోలని మండల విస్తరణ అధికారి తలారీ మల్లేశం సూచించారు. శుక్రవా రం మండలంలోని ఓబుల్ కేశ్వాపూర్, పెద్దరాంచర్ల గ్రామాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరికి బధులు పప్పు దినుసులు, కూరగాయలు, నూనే గింజలను సాగు చేయాలని సూచించారు. ఒకే రకమైన పంటలు వేస్తే మార్కెట్లో డిమాండ్ ఉండదని, ఇతర పంటలు వేస్తే మార్కెట్లో మం చి డిమాండ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో రైతులు నిమ్మ శ్రీకాంత్ రెడ్డి, ఏళ్ల రాంరెడ్డి, బాలకృష్ణ, కిష్టస్వామి, నర్సింహరెడ్డి, జయపాల్ రెడ్డి, బాలయ్య, సోమయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల: రైతులు ఇతర పంటలపై మొగ్గుచూపాలని మండల వ్యవసాయాధికారి బీ రామకృస్ణ సూచించారు. మండలంలోని పెదమడూరులోని రైతువేదికలో రైతులతో సమావేశమై ప్రత్యామ్నాయ పంటల సాగు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై దృష్టి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరుశనక, మినుములు, మక్కజొన్న, శనగలు, పెసర పంటలు సాగుచేసకుంటే అధిక దిగుబడులతో పాటు మార్కెట్ ఉంటుందన్నారు. అనంతరం గ్రామంలో వేరుశనక సాగు చేసిన రైతులు క్షేత్రాన్ని రైతులకు చూపించి అతడి బాటలో నడువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గిరి, ఏఈవో సుప్రియ, రైతులు బోనగిరి యాదగిరి, శ్రీనివాస్ ఉన్నారు.
బచ్చన్నపేట: ఇతర పంటలపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని పోచన్నపేట రైతువేదిక భవనంలో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో ప్రతి ఏడా ది పంటల సాగులో మార్పులో తెస్తేనే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కేవలం వరి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలన్నారు. దీంతో తక్కువ నీటితో పాటు పంటలకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. దీనికి తోడు ఆధికంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు మంజుల మల్లేశం, ఎంపీటీసీ మామిడి అరుణ, ఏఈవో హారిక, రైతబంధు సమితి కోఆర్డినేటర్ ఫిరోజ్, రైతులు రామిని మదన్మోహన్, గూడ సిద్ధ్దారెడ్డి, శివరాములు, మల్లేశం పాల్గొన్నారు.