కాటారం/ మల్హర్/ గణపురం, డిసెంబర్3: కాటారం మండల కేంద్రతోపాటు గంగారం, మేడిపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ దబ్బెట స్వామి శుక్రవారం ప్రారంభించారు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ చెప్యాల రామారావు ప్రారంభించారు. ఎడ్లపల్లి, మల్లంపల్లి, అన్సాన్పల్లి, నాచారం, తాడ్వాయి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్లు, రైతులు, సిబ్బంది ఉన్నారు. గణపురం మండలంలోని మైలారం, గాంధీనగర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ప్రారంభించారు. అనంతరం బుద్ధారం గ్రామంలో ధనలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చిట్యాల జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన ఏవో నాలికె రఘుపతి ఆధ్వర్యంలో సెంటర్ ఇన్చార్జులతో సమీక్ష నిర్వహించారు.