వర్ధన్నపేట మున్సిపాలిటీకి మూడు ఆస్పత్రులు మంజూరు
మెరుగైన సేవలందేలా చూస్తాం ఎమ్మెల్యే అరూరి రమేశ్
పనిచేస్తేనే గుర్తింపు సీహెచ్‌సీని మరింత విస్తరించాలి
కలెక్టర్ బీ గోపివైద్యుల పనితీరుపై ఆగ్రహం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
వర్ధన్నపేట, జనవరి 3: మండల పరిధిలోని ఇల్లం ద, దమ్మన్నపేట గ్రామాల్లోని పల్లెదవాఖాలను మరిం త ఆధునీకరించి, మెరుగైన సేవలందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. సోమవారం స్థానిక కమ్యూ నిటీ హెల్త్ సెంటర్‌కు మంజూరైన అధునాతన స్కానర్, ఇతర వైద్య పరికాలను ఎమ్మెల్యే రమేశ్, కలెక్ట ర్ గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దవాఖానలో వైద్యు లు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరో పించారు. దీంతో వైద్యులు పనితీరును మార్చుకోవాల ని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించినా, డుమ్మాకొట్టినా సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడు తూ వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి మూడు బస్తీ దవా ఖానలు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం పట్టణ ప్రజలకు చేరువగా వైద్య సేవలుండాలనే లక్ష్యం తో హైదరాబాద్‌తోపాటు పట్టణ ము న్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానా లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపా రు. వీటితో పాటుగా గ్రామాల్లోని సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చి పేదలకు మరింత మె రుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ పేద లకు వైద్యులు మంచి సేవలందించితే గు ర్తింపు వస్తుందని అన్నారు. త్వరలో నే ఆస్పత్రిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీ ఎం దవాఖానలో రద్దీ ఎక్కువగా ఉన్నందున వర్ధన్న పేట సీహెచ్‌సీలో సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అధునాతన పరికరాలు ప్రభుత్వం నుంచి మం జూరయ్యేలా కార్యాలయం నుంచి నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందిస్తామని కలెక్టర్ వివరించారు. కా ర్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, డీసీహెచ్ సంజీవయ్య, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్, వై ద్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు.