దేశంలోనే బెస్ట్ క్రెడిత్ గ్రోత్ అవార్డు దక్కించుకున్న డీసీసీబీ
సుబేదారి, జనవరి3: ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకుకు దేశంలోనే బెస్ట్ క్రెడిట్ గ్రోత్ అవార్డు దక్కింది. ముంబైకి చెందిన బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ మ్యాగజైన్ ఈ అవార్డులను ప్రకటించింది. ఇటీవల గోవాలో నిర్వహించిన 15వ జాతీయ సహకా ర బ్యాంకింగ్ సమ్మేళనంలో పర్చువల్ పద్ధతిలో వరంగల్ డీసీసీ బ్యాంకు రుణాల మంజూరు విషయంలో ఉత్తమ రుణ వృద్ధి అవార్డు గెలుచుకున్నది. ఈసందర్భంగా హనుమకొండ అదాలత్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు బెస్ట్ అవార్డును సీఈవో చిన్నారావుకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా వరంగల్ డీసీసీబీ అన్ని వర్గాల ప్రజల కు రుణాలు ఇచ్చిందని అన్నారు. రుణ మంజూరులో బ్యాంకుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యో గులకు చైర్మన్ అభినందనలు తెలిసాను. ఇదే స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎం లు ఉషశ్రీ, అశోక్, ఏజీఎంలు మధు, స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.