రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు
శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి
కాళేశ్వరం ఆలయంలో పూజలు
ఎమ్మెల్యే గండ్రతో కలిసి లక్ష్మీ పంప్‌హౌస్, సరస్వతీ బరాజ్ సందర్శన
కాళేశ్వరం, జనవరి 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టే కాళేశ్వరం ప్రాజెక్టు అని, దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి, వారి కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా వారు ఆలయానికి వెళ్లగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గణపతి ఆలయంలో వద్ద పూజలు చేసి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసీ స్వామి వారి శేషవస్ర్తాలతో సన్మానించారు. అనంతరం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్‌హౌస్ వద్దకు రాగా ఈఈ తిరుపతిరావు స్వాగతం పలికారు. పంప్‌హౌస్ వ్యూ పాయింట్ వద్ద ఉన్న చిత్రంతో ప్రజెక్టులోని లింక్ వన్ గురించి వివరించారు. పంప్‌హౌస్‌లోని మోటార్లను సందర్శించారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ వెంబడి చూసుకుంటూ సరస్వతీ బరాజ్‌కు చేరుకుని పరిశీలించారు. అనంతరం భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, ప్రాజెక్టు పనుల సమయంలో వచ్చి మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. ఇంతకుముందు కరువుతో ఉండే ప్రాంతం నేడు పాడి పంటలతో కళకళలాతున్నదని చెప్పారు. వారి వెంట సీఐ కిరణ్ తదితరులు ఉన్నారు.