టీనేజర్లకు 12 పీహెచ్‌సీలు,రెండు సీహెచ్‌సీల ద్వారా వ్యాక్సినేషన్
మొదట భూపాలపల్లి పాఠశాలలోని వంద మంది పిల్లలకు టీకా..
వారం రోజుల్లో పూర్తిచేస్తాం
జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
కృష్ణకాలనీ, డిసెంబర్ 3 : కొవిడ్, ఒమిక్రాన్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పనిచేస్తున్నదన్నారు. టీనేజర్స్‌కు సోమవారం నుంచి 12 ప్రాథమి ఆరోగ్య కేంద్రాలు, రెండు సీహెచ్‌సీల్లో టీకా ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 50 వేల మంది జనాభా ఉండగా అందులో టీనేజర్లు 20,856 మంది ఉన్నట్లు చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించిన టీకాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదటగా భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని 100 మంది పిల్లలకు టీకా ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమం వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్, డీపీవో ఆశాలత, 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, టీఆర్ఎస్ అర్బన్ ప్రధాన కార్యదర్శి బీబీ చారి, నాయకులు బాబర్ పాషా, మదన్మోహన్, కరీం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మమత, జిల్లా సర్వేలైన్స్ అధికారి డాక్టర్ బోడ రవికుమార్‌నాయక్, సీహెచ్‌వో ఓనపాకల రాజయ్య, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ ఆరెపల్లి జ్యోతి, పీహెచ్సీ సిబ్బంది శ్యామ్, ప్రభాకర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.