పాలపల్లి టౌన్, అక్టోబర్ 2 : తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ బతుకమ్మ పండగ సారె పంపించారని, గతంలో ఏ పాలకులు చేయని పని సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ శ్రీనివాస్ అధ్యక్షతన బతుకమ్మ చీరెల పంపిణీని అడిషనల్ కలెక్టర్ దివాకరతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీ జయంతి రోజున తెలంగాణ ఆడబిడ్డకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. గాంధీజీ కలలను సాకారం చేయాల్సిన ఆవశ్యకత యువతపై ఉందన్నారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం, రైతులు, మహిళలు బాగుపడినప్పుడే పల్లెలు బాగుంటాయని గాంధీజీ చెప్పారని, తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. నేను వేరే రాష్ట్రంలో పని చేశానని, అక్కడికి ఇక్కడికీ చాలా తేడా ఉందన్నారు. ఇక్కడ ప్రతి గ్రామంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని, కాళేశ్వరం పాజెక్ట్ ఇంజినీరింగ్ ప్లాన్ ప్రపంచంలోనే అద్భుత ఘట్టమన్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాలు ఫాలో అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో ఆశాలలత, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొ న్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
చిట్యాల(మొగుళ్లపల్లి): మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సొసైటీ మాజీ చైర్మన్ నరహరి బక్కరెడ్డి తల్లి సుశీలమ్మ, పాత ఇస్సిపేటకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మాసు పద్మ ఇటీవల మృతి చెందగా మరణించగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ యార సుజాతసంజీవరెడ్డి, జడ్పీటీసీ జోరుక సదయ్య, పీఏసీఎస్ చైర్మన్ నర్సింగరావు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.