జయశంకర్భూపాలపల్లి, అక్టోబర్ 2 (నమస్తేతెలంగాణ) : నైతిక విలువలులేని, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న నీకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలభూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషపై మార్చుకోవాలని హైకోర్టు మొట్టికాయలు వేసినా నీరు సిగ్గురాలేదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు లీజుకు తీసుకున్నాడని, ఆ పార్టీకి ఏజెంట్‌గా ఆపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, నీవు పదవి పొందిన పార్టీ ఏ రకం పార్టో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సీఎం కుటుంబాన్ని విమర్శిస్తే సంహించేదిలేదు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కాలి గోటికి సరిపోని నీవు, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి లేదన్నారు. తెలంగాణ ఉద్యకారులను ఏకె 47తో కాలుస్తానంటూ కారులో బయలు దేరిన ద్రోహి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. సొంత గ్రామంలో చెట్టుకు కట్టేసి కొడితే పారిపోయి వచ్చిన రేవంత్‌రెడ్డి నైతిక విలువలు లేకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే నీ చరిత్రను ఎండ గడుతామని అన్నారు. మచ్చ లేని రాజకీయ నాయకుడు గండ్ర, ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి , ఎంపీపీ మందల లావణ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, పార్టీ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, లక్ష్మీనర్సింహరావు, పీఏసీఎస్ చైర్మన్లు పూర్ణచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి,నాయకులు సాంబమూర్తి, సిద్దు, పూలమ్మ, సరోజన, కరీం, బాబుమియా పాల్గొన్నారు.