బాధిత కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, నాయకుల పరామర్శ
ఆదుకుంటామని ధైర్యం చెప్పిన నేతలు
ఆర్థిక సాయం అందజేత
నర్సంపేట రూరల్, జనవరి 2: జిల్లావ్యాప్తంగా పలు బాధిత కుటుంబాలను ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి చేయూతనిచ్చారు. ఇందులో భాగంగా నర్సంపేట ముత్యాలమ్మతండాకు చెందిన జాటోత్ రమేశ్‌నాయక్ శనివారం అనార్యోగంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం తండాకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ మృతికి సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా సైద, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి రాంప్రసాద్, కిషన్, రాజు, తిరుపతి, దేవేందర్ పాల్గొన్నారు. ముత్తోజిపేటకు చెందిన కోడూరి ఎల్లయ్య, జన్ను సారయ్య ఇటీవల మృతి చెందారు. సర్పంచ్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకుడు తాళ్లపల్లి రాంప్రసాద్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్‌పాషా, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోశాల లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ రాగిశెట్టి బుచ్చయ్య, ఎండీ యాకూబ్‌పాషా, గుర్రం శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, రఘునాథ్, బుచ్చిరెడ్డి, అనిల్, సతీశ్ పాల్గొన్నారు.
బాధితులకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ
సంగెం: తీగరాజుపల్లిలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ బానోత్ దస్రునాయక్, సొసైటీ మాజీ డైరెక్టర్ బానోత్ సరిరాం ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను చల్లా పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్ కర్జుగుత్త రమాగోపాల్, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, సోమ్లాతండా సర్పంచ్ మంగ్యానాయక్, గుగులోత్ వీరమ్మ, ఉండీల రాజు ఉన్నారు.
చైర్మన్‌కు ఎమ్మెల్యే అరూరి పరామర్శ
పర్వతగిరి: మండలంలోని చౌటపెల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. దేవేందర్ అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని మ్యాక్స్‌కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అరూరి ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని దేవేందర్‌కు సూచించారు. అరూరి వెంట కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, బొక్కల బాబు ఉన్నారు.
మృతుల కుటుంబానికి ఆర్టీసీ కార్మికుల అండ
నర్సంపేట/చెన్నారావుపేట/పర్వతగిరి: ఇటీవల మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు కార్మికులు అండగా నిలిచారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న డ్రైవర్ బూస రవి మృతి చెందగా, బాధిత కుటుంబానికి తోటి కార్మికులు యూనియన్ నాయకులతో కలిసి రూ. 63,500 ఆర్థిక సాయం అందించారు. కొన్ని నెలల క్రితం మరణించిన డ్రైవర్ ప్రభాకర్, కండక్టర్ రాజన్న కుటుంబాలకు రూ. 2.32 లక్షల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కార్మికుల బృందం బాధ్యులు గొలనకొండ వేణు, వేముల రవి, ఎంకే స్వామి, కొలిశెట్టి రంగయ్య, చీకటి వెంకటేశ్వర్లు, మేకల రాజ్‌కుమార్, నానబోయిన రాజయ్య, ప్రకాశ్ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన తాళ్ల కోటి ఇటీవల మరణించగా, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి క్వింటాల్ బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుండాల మహేందర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దొంగల రాజ్‌కుమార్, ఎడ్ల నారాయణరెడ్డి, అనుముల రవి, పున్నం నర్సయ్య, రంజిత్, జనార్దన్‌రెడ్డి, ఇందూరు నర్సిరెడ్డి, గోనె రాజేందర్, పోశయ్య, తాండ్ర స్వామి, హమాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు తాళ్ల యాకయ్య చిన్నకుమారుడు ప్రవీణ్ ఇటీవల పర్వతగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. టీఆర్ఎస్ ఎస్టీసెల్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిషన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.