డిసెంబర్ 31న ఉమ్మడి జిల్లాలో రూ.24.34 కోట్ల మద్యం విక్రయాలు
23,583 పెట్టెల లిక్కర్.. 24,210 పెట్టెల బీర్లు సేల్
ఆంక్షలు పెట్టినా తగ్గని మద్యం ప్రియులు
హనుమకొండ సిటీ, జనవరి 1 : నూతన సం వత్సరం సందర్భంగా పోలీసులు ఎన్ని ఆంక్ష లు విధించినా, ఒమిక్రాన్ భయం వెంటాడి నా మందుబాబులు లెక్కచేయలేదు. న్యూఇయర్ వేడుకలను మం దు, మాంసంతో ఎంజాయ్‌గా జరుపుకున్నారు. డిసెంబర్ 31 మధ్యా హ్నం నుంచే వైన్స్, బార్ల ఎదుట మద్యం కోసం పోటీపడడం కనిపించింది. పెట్టెల కొద్ది మద్యాన్ని కార్లు, బైకుల్లో తీసుకెళ్లారు. డిసెంబర్ 31 ఒక్క రోజే ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రూ.24.34 కోట్ల మద్యం అమ్ముడుపోవడం విశేషం. 23,583 పెట్టెల లిక్కర్, 24,210 పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్క రోజులోనే రూ.కోట్లలో మద్యం విక్రయాలు జరుగడంతో ఆబ్కారీ శాఖ ఖజానాకు ఫుల్ ఆదాయం వచ్చింది.