ఐనవోలు, జనవరి 1 : అనాథ పిల్లలకు అండగా కడియం ఫౌండేషన్ నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీయం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రానికి చెందిన బరిగెల సురేశ్, ప్రసన్న దపంతులు ఆరు నెలల వ్యవధిలో అనారోగ్యంతో మృతిచెందగా వారి ఇద్దరి పిల్లలు అనాథలు గా మారారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కడియం ఫౌండేషన్ చైర్పర్సన్ కడియం కావ్య, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి చిన్నారులు కన్నయ్య, నందుతోపాటు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. కడియం ఫౌండేషన్ నుంచి రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు భవిష్యత్‌లో అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామన్నారు. పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఫౌండేషన్ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే, ఐనవోలు మల్లికార్జునస్వామిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ డైరెక్టర్లు ఘన స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, అర్చక బృందం స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన, ఉప సర్పంచ్ సతీశ్‌కుమార్, జనగామ ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రజాక్‌యాదవ్, సుధాకర్‌బాబు గర్మిళ్లపల్లి సర్పంచ్ గండి మల్లికాంబ, ఆలయ డైరెక్టర్లు సింగారపు రాజు, లెక్కల వెంకట్‌రెడ్డి, మండల నాయకులు పరమేశ్, అశోక్, మధుకర్, రమేశ్, కుమారస్వామి, అశోక్ పాల్గొన్నారు.