ఖిలావరంగల్, జనవరి 1 : కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలెక్టర్కు పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు, టీఎన్జీవోస్ నాయకులు కలెక్టర్ బీ గోపిని సత్కరించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు దుప్పట్లు, రగ్గులు, మాస్కులు అందజేశారు. అనంతరం కలెక్టర్కేక్ కట్ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనదపు కలెక్టర్ బీ హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, కలెక్టరేట్ ఏవో విశ్వనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనాథాశ్రమానికి కిడ్డీ బ్యాంక్ డబ్బుల అందజేత
ఖిలావరంగల్ : నూతన సంవత్సరం సందర్భంగా హనుమకొండలోని గౌతమి పాఠశాలకు చెందిన 1వ తరగతి బాలుడు జీ శ్రీస్నేహిత్రెడ్డి తన కిడ్డీ బ్యాంక్లో జమ చేసిన డబ్బులను అనాథ పిల్లలకు ఇవ్వాలని కలెక్టర్ బీ గోపికి శనివారం అందజేశాడు. కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ బాలుడిని అభినందించి ఏదైనా అనాథాశ్రమానికి డబ్బులు అందజేయాలని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధకు ఆదేశాలు జారీ చేశారు.