మహదేవపూర్, జూన్ 7 : ఈతకు వెళ్లి శనివారం మేడిగడ్డ బరాజ్‌లో ఆరుగురు గల్లంతయ్యారు. ఎనిమిది మంది స్నేహితులు కలిసి వెళ్లగా ఇద్దరు పట్టి శివమణి, పట్టి వెంకటస్వామి ప్రాణాలతో బయటపడగా.. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన పత్తి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్నాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన పండు(18), రాహుల్ (19) ఆచూకీ దొరకలేదు.
కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ అక్కడికి చేరుకొని సింగరేణి రెస్క్యూ, గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వారంతా 20 ఏళ్ల లోపు యువకులే. కాగా తమ పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ చేరుకొని సహాయక చర్యలపై ఆరా తీశారు.