
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 1: వరంగల్ నగరంలో ఘోరం జరి గింది. ఎల్బీనగర్లోని మోమిన్‌పురాలో బుధవారం తెల్లవారుజాము న నాలుగు గంటల సమయంలో ముగ్గురు దారుణ హత్యకు గుర య్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతు న్నారు. పశువుల వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక లావాదేవీల తగాదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తున్నది. సొంత తమ్ముడే తన అన్నావది నలను కడతేర్చడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోరంలో చాంద్‌పాషా (50), అతడి భార్య సాబీరా (40), బావమరిది ఖలీల్ (42) మృతి చెందారు. ఈ ఘటనతో నగరంలో భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పురాకు చెందిన చాంద్‌పాషా, అతడి సోదరులు షఫీ, షమీమ్ కలిసి 20 ఏళ్లు గా పశువుల వ్యాపారం చేస్తున్నారు.
పరకాల, ములుగు ఏరియాల్లో హోల్‌సేల్‌గా వ్యాపారం నడుపుతున్నారు. ఏడాది నుంచి చాంద్‌పాషా కు, అతడి తమ్ముడు షఫీకి ఆర్థిక లావాదేవీల్లో తగాదాలు చోటుచేసు కున్నాయి. సుమారు కోటి రూపాయలకు సంబంధించి వివాదం తలె త్తగా ఈ విషయంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కక్షలు పెరిగాయి. మోమిన్‌పురాలో ఉంటున్న చాంద్‌పాషా ఇంటికి, వరంగల్ తిలక్‌రోడ్డులోని మదీనా వీధిలో ఉండే షఫీ కొందరు వ్యక్తులతో కలిసి బుధవారం తెల్లవారుజామున 3.30-4గంటల సమయంలో వచ్చాడు. అన్న ఇంటి తలుపులను కట్టెను కోసే ఇనుప రంపం మిషన్‌తో కోసి పగులకొట్టి లోనికి ప్రవేశించారు. ముందుగా హాలులో ఉన్న చాంద్‌పాషా, అతడి భార్య సాబీరా, బావ మరిది ఖలీల్‌పై కారంపొడి, కత్తులు, ఇనుప రంపంతో దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా ముగ్గురి శరీరంపై పొడిచారు. తర్వాత ఇనుప రంపంతో గొంతులు కోశారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రంపంతో కోస్తున్నప్పుడు సౌండ్ ఏర్పడ కుండా బయట ఆటోను ఆన్‌లో ఉంచి ఎక్కువ రేస్ చేస్తూ ఒకరు కాపలా కాశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో హాలులోనే ఉన్న చాంద్‌పాషా కూతురు రుబీనా(హీనా) తనను చంపొద్దని ప్రాధే యపడడంతో షఫీ ఆమెను వదిలేశాడు. మరో గదిలో పడుకున్న చాంద్‌పాషా కొడుకులు ఫహద్, సమద్ నిద్రలేచి హాలులోకి పరిగె త్తుకొచ్చారు. వీరిద్దరిపైనా షఫీ, అతడి అనుచరులు దాడికి దిగడంతో ఫహద్, సమద్ తీవ్రంగా గాయపడ్డారు. ఎలాగోలా తప్పించుకొని గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నారు. శబ్దంతో చుట్టుపక్కల వాళ్లు లేవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
రక్తపు మడుగులో మృతదేహాలు
సమాచారం తెలిసి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు న్నారు. చాంద్‌పాషా ఇంట్లోని హాలు రక్తపు మడుగు కట్టడాన్ని చూసి స్థానికులు భీతిల్లారు. తీవ్ర గాయాలతో ఉన్న ఫహద్, సమద్‌లను చికి త్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షి రుబీనాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ సీఐలు గణేశ్, మల్లేశ్ ఉన్నారు.
ఎల్బీనగర్లో భయానకం.. హృదయవిదారకం
తెల్లవారగానే ఈ ఘటన గురించి సమాచార మాధ్యమాల ద్వారా తెలిసి నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు. ఒకేసారి ముగ్గురిని హతమా ర్చారని తెలిసి భయాందోళన చెందారు. చాంద్‌పాషా ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురిని చూసి స్థానికులు భీతిల్లారు. ఓ వైపు భయానకం.. మరోవైపు హృదయ విదారకమైన ఈ ఘటన రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపింది. చాంద్‌పాషా తమ్ముడు షఫీ నివాసం ఉండే మదీనా వీధిలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. షఫీ ఇంటి వద్ద కూడా మోహరించారు.
రైలు అందక.. ఖలీల్ బలి
కేసముద్రం : మండలంలోని అమీనాపురానికి చెందిన కేసముద్రం స్టేషన్లో రేడియో, టీవీ, సెల్ వరల్డ్ దుకాణం నడుపుతున్నాడు. ఓ సెల్‌ఫోన్ కంపెనీలో సర్వీస్ ఇంజినీర్‌గా మహబూబాబాద్‌లో ఉద్యో గం పొందాడు. ఇటీవల మహబూబాబాద్ నుంచి వరంగల్ బదిలీ అయ్యాడు. నిత్యం కేసముద్రం నుంచి వరంగల్ వెళ్లి వస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లగా రైలు మిస్సయి ఎల్బీనగర్లో ఉండే తన అక్క సాబీరా ఇంటికి వెళ్లాడు. అక్కాబావతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ఖలీల్ ఈ దారుణ ఘటనలో బలయ్యాడు. అతడికి భార్య షాహేదా, కొడుకు మొహి నొద్దీన్, కూతురు అర్షియా ఉన్నారు.
ఎమ్మెల్యే నరేందర్ పరామర్శ
వరంగల్ చౌరస్తా: మృతుల కుటుంబసభ్యులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరామర్శించారు. బుధవారం తెల్లవా రుజామున ఎంజీఎం దవాఖానలో మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు రక్షణ కోరడంతో అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంతెజార్గంజ్ సీఐ మల్లేశ్‌తో మాట్లాడి ఘటనకు గల కారణాలను, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామ న్నారు. ఎమ్మెల్యేతో మైనార్టీ నాయకులు సయ్యద్ మసూద్, కార్పొ రేటర్లు దిడ్డి కుమారస్వామి, పుర్ఖాన్, టీఆర్ఎస్ నాయకుడు ఆకుతోట శిరీష్ ఉన్నారు. దాడికి గురై ఎంజీఎంలో చికిత్స పొందుతున్న చాంద్ పాషా కొడుకులు సమద్, ఫహద్‌లను వరంగల్ అర్బన్ డెవలప్ మెంట్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల అదుపులో ఆరుగురు?
వరంగల్ చౌరస్తా: ఘటనపై చాంద్‌పాషా కూతురు రుబీనా (హీనా) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండీ షఫీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. షఫీతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు. హత్యకు ముందే పథకం రచించి, మద్యం మత్తులో అమలు చేసినట్లు అ నుమానాలు ఉన్నాయన్నారు. కాగా షఫీతోపాటు మరో ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు, వారిలో ఒకరు ఆటో డ్రైవర్ అని, వీరిని వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిలోని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కళ్లెదుటే ప్రాణాలు తీశారు
– రుబీనా, మృతుడి కుమార్తె
సుమారు ఆరుగురు వచ్చారు. కట్టర్ మిషన్, కత్తులతో మా అమ్మానా న్నను చంపారు. అడ్డుపోయిన మా మామయ్యను కూడా చంపేశారు. మా సోదరులపై కత్తులతో దాడి చేశారు. బాబాయ్ మమ్మల్ని చంపొద్దని ఎంత వేడుకున్నా వినలేదు. నేను కాళ్ల మీద పడి ఏడిస్తే నన్ను వదలిపె ట్టారు. మా నాన్న దగ్గర ఎలాంటి డబ్బు లేదు. నా భర్త ఖతర్‌లో ఉంటాడు. నేను నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా. మేమంతా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. మా వాళ్లను అన్యాయంగా చంపారు.