సుబేదారి, సెప్టెంబర్1: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భా స్కర్ తల్లిదండ్రులు సిలోత్రీ దేవి, రంగయ్య జ్ఞాపకార్థం గా హనుమకొండ వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో అంగన్ వాడీ కేంద్రాన్ని నిర్మించారు. రూ. లక్షా 75వేల కార్పొరే టర్ నిధులతో విజయ్‌భాస్కర్ ఈ భవనాన్ని అన్ని హం గులతో నిర్మించారు. బుధవారం ఛీఫ్ విప్ వినయ్‌భాస్క ర్ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తమ్ముడు విజయభాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకొని అం గన్వాడీ కేంద్రం నిర్మించాడన్నారు. తల్లిదండ్రులు, అన్నయ్య ప్రణయ్‌భాస్కర్ ఆశీస్సులు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో వరంగల్ పశ్చిమ ని యోజకవర్గ ప్రజల దీవెనలతో తాము ఈ స్థాయిలో ఉ న్నామని అన్నారు. కార్యక్రమంలో డీఈవో కే నారాయ ణరెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.