జనగామ, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న దళితబంధు పథకం ద్వారా మూడేళ్లలో దశల వారీగా ప్రతి దళిత బిడ్డకూ లబ్ధి చేకూరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత ప ట్టుదల ఉన్న ముఖ్యమంత్రిని చూడలేదని, ఏదైనా పథకం రూపొందించారంటే దాన్ని విజయవంతంగా అమలు చేసే వరకు వదిలిపెట్టని నాయకుడని ప్రశంసించారు.
దళితబంధుపై కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని, ధర్నాలు, రా స్తారోకోలు చేస్తున్నారని, ఒకేసారి అందరికి ఇస్తే ఏమైతదని అంటున్నారని, మిగిలిన వర్గాలకు పథకాలు అమలు చేయడం వారికి ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారో వా రికే అర్థం కావడం లేదని మండిపడ్డారు. మూడేళ్లలో ప్రతి దళిత బిడ్డకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షలు అందుతాయని స్పష్టం చేశారు. రూ.40వేల కోట్ల ఖర్చుచేసి ఇం టింటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రధాని స్వాతంత్య్ర వేడుకల్లో జీవన్ ధార పేరుతో ఇంటింటికీ మంచినీటి పథకాన్ని ప్రకటించడానికి తెలంగాణలోని మిషన్ భగీరథ పథకం స్ఫూర్తి అన్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సై తం ఒక సవాల్‌గా తీసుకొని విజయవంతంగా అమలు చే స్తున్నామని, ముదిరాజ్‌లకు చేపలు, గొల్ల, కుర్మలకు గొర్రె లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రూ.13వేల కోట్లు ఖర్చుచేసి రైతులకు పంట పెట్టుబడి ఇస్తారని ఎవరైనా ఊ హించారా? అని మంత్రి ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకు లు సృష్టించినా రేపు దళితబంధు సైతం ఇలాగే అమలు చే సి తీరుతాం.. చాలెంజ్‌గా తీసుకొని అందరికీ వర్తింపజే స్తాం.. వంకర కూతలు కూస్తున్న నాయకులు దమ్ముంటే మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు. దళితులు, మైనార్టీల పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప ఆయా వర్గాలకు మీరేం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తొలి ఏడాది రూ.25వేల కోట్లు, రెండో ఏడాది రూ.30వేల కోట్లు, మూడేళ్లలో అన్ని కుటుంబాలకు రూ.10లక్షలు అందిస్తామన్నారు. తెలంగాణ వచ్చిన త ర్వాత ముస్లింలకు టీఆర్ఎస్ చేసినంత ఇతర పార్టీలు చేయలేదని, అధికారికంగా రంజాన్ పండుగ జరిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవ్వడం, పేదలకు బహుమతులు ఇవ్వడం, మైనార్టీ స్కూళ్లు, కాలేజీలు, గురుకులాలు ఏర్పాటు చేయడం, షాదీముబారక్ కింద పెళ్లిళ్లకు సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మైనార్టీలను మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇలాంటి కార్యక్రమాలు చేశారా? మత పెద్దలను గౌరవించారా? వేతనాలు ఇచ్చారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో నంబర్ వన్‌గా ఉందని కేంద్ర ప్రభుత్వమే చెబుతూ అవార్డులు ఇస్తున్నదని, ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం ప్రజల అదృష్టమన్నారు.
ఒకప్పటి జనగామ ఇప్పటి జనగామను చూడండి.. మొత్తం రూపురేఖలు మారుతున్నాయి.. గతంలో తాగునీటిని తండ్లాట ఉండేది.. ఇప్పుడు పుష్కలంగా భూగర్భ జలాలు పెరిగాయి.. జిల్లాలో రూ. వెయ్యి కోట్లు ఖర్చుచేసి ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామని, సాగునీటికీ ఢోకాలేదన్నారు. పంటలు రికార్డు స్థాయిలో పండుతున్నాయన్నారు. జనగామకు జిల్లా అయిన తర్వాత గుర్తింపు వచ్చిందని, ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దయ, పుణ్యం కాదా? కరువుగడ్డను ధాన్యాగారం చేసిన మహానుభావుడు ఆయన కాదా? అని ప్రశ్నించారు. ఆయన వెంట కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, స్వరూప, బండ పద్మ, నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, వంగ ప్రణీత్‌రెడ్డి, లెనిన్, బాల్దె సిద్ధిలింగం, శారద, బైరగోని యాదగిరిగౌడ్, నారోజు రామేశ్వరాచారి తదితరులు ఉన్నారు.