కమలాపూర్, ఆగస్టు 15 : కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కమలాపూర్ మండలంలో ఒక్క రూపాయి పనిచేయలేదని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో దేశరాజ్పల్లి, పంగిడిపల్లి, గూడూరు గ్రా మాలకు చెందిన సుమారు 250 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివా రం విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ బండి సంజయ్ ఎంపీ గా గెలిచి రెండేళ్లవుతున్నా ఇక్కడ ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తాడని ప్రశ్నించారు. దళితబంధు పథకంపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ పథకాన్ని ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మండలంలో 15వేల మంది స్వచ్ఛందంగా శాలపల్లిలో జరిగే సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్తున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలు నచ్చకనే ఆ పార్టీల కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు.
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాగా, పార్టీలో చేరిన వారిలో దేశరాజ్పల్లికి చెందిన ఉపసర్పంచ్ మిట్టపల్లి సుభాష్, వార్డు సభ్యులు నాగుర్ల వెంకటేశ్, పాత భార్గవ్, దాసరి శ్రీనివాస్, సురావు, రాజేశ్, ఎండీ హకీం, మర్రిపెల్లి రాజేశ్, సాంబయ్య, రాజు, సముద్రాల సాయిలు, శ్రీనివాస్, ఓగ్గోజు మొగిలి, సముద్రాల చంద్రమౌళితోపాటు వందమంది ఉన్నారు. అలాగే, పంగిడిపల్లికి చెందిన ఆలేటి రాజు, తిప్పారపు శ్రీకాం త్, తరిగొప్పుల అనిల్, ఎండీ రహీం, ఎండీ రియాజ్, ఓంకార్, మమ త, ఎండీ రజియాబేగం, నర్సక్క, సునీతతోపాటు గూడూరుకు చెందిన ముదిరాజ్ కులస్తులు గాలిబ్ శంకర్, ముత్తయ్య, నటరాజ్, తెప్ప కుమారస్వామి, తెప్ప భద్ర య్య, వీరస్వామి, సాంబమూర్తి, రవీందర్, నరహరి, సాంబయ్య తదితర 50 మంది కూడా టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సుగుణాకర్రావు, పాక లక్ష్మీరవీందర్ పాల్గొన్నారు.