
వర్ధన్నపేట/సంగెం, సెప్టెంబర్ 15: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సీడీపీవో శ్రీదేవి సూచించారు. వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఆహార పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై వివరించారు. ప్రధానంగా బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఉదయం, సాయంత్రం స్నానం చేస్తూ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంగెం మండలంలోని సోమ్లాతండాలో కాపులకనపర్తి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సెక్టార్ సూపర్వైజర్ ఉమాదేవి మాట్లాడుతూ గర్భిణులు ఆకుకూరలు, పాలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులను ఆహారంగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆర్యోగంగా ఉంటాడని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంగ్యానాయక్, సోమ్లానాయక్తండా అంగన్వాడీ టీచర్ బానోత్ సరిత పాల్గొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
చెన్నారావుపేట: ఎదుగుతున్న పిల్లలు జంక్‌ఫుడ్ మాని.. పోషకాహారం తీసుకోవాలని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్ హెచ్ఎం ఫ్లోరెన్స్ అన్నారు. పోషణ అభియాన్‌లో భాగంగా పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. పౌష్టికాహారం ప్రాధాన్యాన్ని తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కాసాని రవి, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, రజిత, సరోజ, ఉపాధ్యాయులు ఉమారాణి, జ్యోతిరాణి, పీఈటీ భిక్షపతి పాల్గొన్నారు.