యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రమేశ్

నయీంనగర్, సెప్టెంబర్14: కాకతీయ విశ్వవిద్యాలయం నేడు ఉపాధి కల్పనా కేంద్రంగా మారిందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు 75శాతం ప్రాంగణ నియామకాలు పొంది న సందర్భంగా ఆయన మంగళవారం దూరవిద్యా కేంద్ర సెమినార్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల 2020-21 విద్యా సంవత్స రంలో 193 మంది(75శాతం) బీటెక్ నాల్గో సంవత్సరం విద్యార్థినులు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 34 సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించారన్నారు. వీరిలో ఐటీ విభాగం నుంచి అత్యధికంగా రూ. 7.5 లక్షల వార్షిక వేతనంతో గుండె సౌమ్య(గైస్సైట్), ఈఈ నుంచి రూ. 6 లక్షల వేత నంతో కందుల శామిని(వర్జీనియా), ఐటీ నుంచి మనీషా, శివాని, హర్షిత రూ. 5లక్షల వేతనంతో జాబ్స్ పొందారని తెలిపారు.
మరో 186 మంది రూ. 4.5 లక్షల వేతనంతో ప్రాంగణ నియామకాలు పొందారన్నారు. అదేవిధంగా ముగ్గురు విద్యార్థినులు అమెరికా లో ఎంఎస్ విద్యను అభ్యసించడానికి అవకాశం వచ్చిందని, మరో ఐదుగురు ప్రతిష్టా త్మక ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించారని అన్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి టాస్క్, కో క్యూబ్స్, తదితర సంస్థలతో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాంగణ నియమకాలు పొందడం అభి నందనీయమన్నారు. రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ మరిన్ని ప్రాంగణ నియా మకాలు పొందే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో మహిళా ఇంజి నీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కోఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ, ప్లేస్మెంట్ డైరెక్టర్ వరలక్ష్మి, శ్రీనివాసారావు, రామచంద్ర తదితరులు ఉన్నారు.