చెన్నారావుపేట, సెప్టెంబర్ 4: మండలంలోని జల్లి నంబర్-1 కాలనీకి చెందిన నమిండ్ల స్వామి అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబ సభ్యులకు శనివారం టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి 50 కిలోల బియ్యం సమకూర్చగా స్థానికులు అందజేశారు. గ్రామ పెద్దలు బర్ల దేవదాసు, సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు, నాయకులు నర్మెట్ట సాంబయ్య, సారంగం, ఉప్పలయ్య, భాస్కర్, రాజేందర్, దిలీప్, ఇస్మాయిల్, నర్సయ్య, రాజేశ్, శ్రీనివాస్, రవీందర్పాల్గొన్నారు. అలాగే, అక్కల్చెడ జీపీ పారిశుధ్య కార్మికుడు మోగిలాజు రాజు ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబసభ్యులకు జీపీ పాలకవర్గ సభ్యులు రూ. 5వేలు, కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.2 వేలు అందజేశారు. ఆర్టీజియన్ కాంప్లెక్స్ యూత్ సభ్యులు రూ. 6100లు, చెన్నారావుపేట సర్పంచ్ పంపించిన 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో అక్కల్చెడ సర్పంచ్ తూటి పావని, ఉపసర్పంచ్ బానోత్ వీరన్న, జీపీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పులిశేరు రాజేందర్, ఆవునూరి శ్రీను, అడుప రమేశ్, అడుప అనిల్ పాల్గొన్నారు.
రాయపర్తి: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తాటికాయల రాజు ఇటీవల అనారోగ్యంతో మృ తి చెందగా, బాధిత కుటుంబాన్ని శనివారం అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పరామర్శించారు. రూ.6500 ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు అయిత సంపత్‌కుమార్, మల్లేశ్, శ్రీనివాస్, తాటికాయల చంద్రయ్య పాల్గొన్నారు.