
నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి
నర్సంపేట, నవంబర్ 14: సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకులు, నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని జేవీవీ వరంగల్ జిలా ్లతృతీయ మహాసభలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా సైన్స్ ఉద్యమాన్ని జేవీవీ కార్యకర్తలు ప్రజల చెంతకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జేవీవీ 33 ఏళ్లుగా సమాజ హితం కోసం సైన్స్ పరిశోధనా ఫలాలను సామాన్యుడి వద్దకు తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. పి.సదాశివుడు ప్రాంగణంలో జరిగిన ఈ మహాసభకు జిల్లా అధ్యక్షుడు జయుడు అధ్యక్షత వహించారు. దయాచంద్, బ్రహ్మం, వెంకటేశ్, వి.రాజు, భిక్షపతి,ఆర్.భిక్షపతి, భద్రయ్య, ఇంద్రసేనారెడ్డి, భాస్కర్, రామయ్య, కుమార్రెడ్డి, సురేష్, దేవేందర్ తదితరులు హాజరయ్యారు.