యూనస్ భవితవ్యమేంటి?
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహ్మద్ యూనస్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్రభుత్వంలో ఆయన పోషించే పాత్రపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
- దేశ అధ్యక్ష పదవి దక్కవచ్చంటూ ఊహాగానాలు!
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహ్మద్ యూనస్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్రభుత్వంలో ఆయన పోషించే పాత్రపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి, ముఖ్యంగా దేశాధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. ఈ ఊహాగానాలపై కాబోయే ప్రధాని తారిఖ్ రహ్మాన్ సలహాదారు హుమాయూన్ కబీర్ స్పందిస్తూ, ‘యూనస్‌తో చర్చలు జరిగాయి. కానీ ఏ పదవీ ఖరారు కాలేదు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు’ అని అన్నారు. అయితే ఈ ప్రచారాన్ని మహ్మద్ యూనస్ కార్యాలయం ఖండించింది.
తారిఖ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న ఓం బిర్లా!
తారిఖ్ ప్రమాణ స్వీకారానికి 12 దేశాలకు ఆహ్వానం అందింది. అదే రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ సమావేశం కావాల్సి ఉండటం వల్ల ఆయన బదులు భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

