Valmidi | వల్మీడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభం
Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (Valmidi ) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి.
జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (Valmidi ) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, శ్రీ లక్ష్మీ సహిత శ్రీ విష్ణు సహస్రనామ, రామ రక్షా స్తోత్ర పారాయణాదులు జరిగాయి.

గోపూజ, ప్రతిష్ట అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రక్షా బంధనము, ఋత్విక్కరణమ్, దీక్ష వస్త్రాధారణ, అంకురారోపణం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు వాల్మీకి పురం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి (Sita Ramachandra Swamy) వారి పురాతన దేవాలయం నుంచి స్వామి వారి విగ్రహాన్ని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా రాముల వారి గుట్టపైకి తీసుకు వచ్చారు. అనంతరం స్వయంభూ పాత దేవాలయంలో కి తీసుకెళ్లి పూజాదికాలు నిర్వహించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 4 వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు, కుటుంబ సభ్యులు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిణి లక్ష్మీ ప్రసన్న, వల్మీడి దేవస్థాన చైర్మన్ జై హింద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

