స్టేషన్ ఘన్పూర్ మార్చ్ 06: డివిజన్ కేంద్రంలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో నేటి నుండి 15 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams )నిర్వహిస్తున్నట్లు బ్రహ్మోత్సవ కమిటీ బాధ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరమహంస పరివ్రాజకులు శ్రీరామ చంద్ర జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6న రాత్రి 8 గంటలకు పెరుమాళ్లు, ఆండాళ్ మూల విరాట్లకు తోళ్లక్కం, చిన కోవెల నుంచి ఊరేగింపుగా కోవెలకు వేంచేయుటతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
సాయంత్రం తోళ్లక్కం, పవళింపు సేవ ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్వహణాక కమిటీ చైర్మన్ కలకోట రంగాచారి, సభ్యులు యాద శ్రీనివాస్, ఎం.రవీందర్, ఎస్. అంజనేయులు, పూజారి రాము తెలిపారు. లయన్స్ క్లబ్, వికాస తరంగిణి వారి సౌజన్యంతో భక్తుల సౌకర్యార్ధం విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లు, ఏర్పాటు చేస్తుమన్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.