హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చిగుమల మౌనికా గౌడ్ని(Mounika Goud )నియమిస్తూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలోని గౌడ కులస్తుల అభివృద్ధికి చేస్తున్న కృషి, వారి సేవలను గుర్తించి మౌనికా గౌడ్ని తెలంగాణ గౌడ సంఘం రాష్ర్ట మహిళా కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు.
గౌడకుల అభివృద్ధికి, తెలంగాణ గౌడ సంఘం ఆశయాలకు, లక్ష్యాలకు, సంక్షేమానికి, గౌడులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కృషి చేస్తానని మౌనికాగౌడ్ అన్నారు. నాపై నమ్మకంతో రాష్ర్ట కార్యదర్శిగా నియమించినందుకుగాను రాష్ర్ట అధ్యక్షులు బొనగాని యాదగిరిగౌడ్కి, గౌడ సంఘం ప్రముఖులు, నాయకులకు మౌనికగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.