కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనుల రిజర్వేషన్లు తొలగించి, వర్గీకరిస్తామని చెబుతున్న టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జోకర్లు, బ్రోకర్లకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు గుణపాఠం చెప్పాలని కోరారు. శనివారం పాలకుర్తి మండలం బమ్మెర పెద్ద తండా(బీ), కిష్టాపురం, నర్సింగపురం, మైలారం తండాల గ్రామ పంచాయతీల పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపనలు చేశారు. కోటి వృక్షార్చనలో భాగంగా మండల కేంద్రంలోని సోమనాథుడి స్మృతి వనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పల్లెలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతోపాటు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
పాలకుర్తి రూరల్, ఆగస్టు 26: వర్గీకరణ పేరుతో గిరిజనులకు ఆదివాసీలకు మధ్య చిచ్చు పెడుతూ రిజర్వేషన్లను తొలగిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ రాజకీయ బ్రోకర్ అని విమర్శించారు. శనివారం పాలకుర్తి మండలంలోని బమ్మెర పెద్ద తండాబీ, కిష్టపురం తండా, నర్సింగపురం తండా, మైలారం తండా గ్రామ పంచాయతీల పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి గిరిజన మహిళలు, యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు డప్పు చప్పుళ్లు పూల మాలలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఆనంతరం జరిగిన సభల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులను వర్గీకరిస్తామని, రిజర్వేషన్లు తొలగిస్తామని రేవంత్‌రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ద్రోహులు, జోకర్ల పార్టీ కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. తండాలను ప్రత్యేక జీపీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు గుర్తింపు లభించిందన్నారు. దీంతో విద్యలో గిరిజన విద్యార్థులు రాణిస్తూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని ఎర్రబెల్లి చెప్పారు. గిరిజన తండాల్లో ప్రతి తండాకు బీటీ రోడ్డు, తండాల్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి తండాకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేశాననన్నారు. నర్సరీలు, వైకుంఠ దామాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం వచ్చే వారిని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా బ్యాగ్‌లను అందిస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు, తండాలను అభివృద్ధి చేసిన తనకు గిరిజనులు అండగా నిలబడాలని ఆయన కోరారు.
మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా: మంత్రి ఎర్రబెల్లి
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఈరవెన్నులోని రైతువేదిక వద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇప్పిస్తున్నామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. డ్వాక్రా సంఘాలను నాడు ఎన్టీఆర్, నేడు సీఎం కేసీఆర్ బలోపేతం చేశారన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందన్నారు. సమైక్య పాలనలో మహిళా సంఘాలకు రూ.600 కోట్లు మంజూరు చేస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 50 వేల మహిళా స్వయం సహాయక సంఘాలుండగా వీటిలో 45 లక్షలకు పైగా సభ్యులున్నారని చెప్పారు.
మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మహిళలకు సంక్షేమ పథకాలు లేవన్నారు. సీఎం కేసీఆర్‌కు, తనకు మహిళలు అండగా నిలబడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డీపీవో రంగాచారి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, తహసీల్దార్ టీ వెంకటేశం, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పీఆర్ ఈఈ చంద్రశేఖర్, డీఈ ఎల్ఆర్ చారి, ఏఈలు ధర్మేందర్, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు జర్పుల బాలునాయక్, సర్పంచ్‌లు జర్పుల మోజీ, బోడ హిమబిందు, శ్రీనివాస్, గుగులోత్ లక్పతి, ముస్కు నిర్మల చంద్రబాబు, ఏపీఎం పిట్టల నరేందర్, ఎంపీటీసీలు పుస్కూరి కళింగరావు, చెరిపెల్లి రాజేశ్వరి, బానోత్ చత్రూ నాయక్, కారుపోతుల వేణు, దార శంకరయ్య, పూజారి మధు పాల్గొన్నారు.