Mohammad Siraj : ఒకరి గాయం.. మరొకరికి వరం అనే మాట ఆటల్లో నూరుపాళ్లు నిజమే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. మొన్నటి వరకూ విహారయాత్ర ప్రణాళికలు వేసుకున్న మియా భాయ్ అనుకోకుండా స్క్వాడ్‌లోకి వచ్చాడు. హర్షిత్ రానా (Harshit Rana) స్థానంలో చోటు దక్కించుకున్న అతడు.. బుమ్రా గాయపడడంతో తుది జట్టులో ఉండి.. పవర్ ప్లేలో రెండు వికెట్లతో యూఎస్ఏను ఓడించడంలో కీలకమయ్యాడు. తనకు వరల్డ్‌కప్ ఆడే అవకాశం రావడంపై సిరాజ్ రియాక్షన్ ఏంటంటే..
రెండేళ్లుగా టీ20 జట్టులోకి రాని సిరాజ్ ఏకంగా ప్రపంచకప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా మోకాలి గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీనియరైన సిరాజ్‌కు ఫోన్ చేసి వచ్చేయాలని చెప్పాడు. ఇదే విషయాన్ని వాంఖడేలో ఆరంభ పోరు తర్వాత మీడియాతో పంచుకున్నాడు హైదరాబాదీ స్పీడ్‌స్టర్.
Called up at the last moment. Trusted the plan. Delivered on the big stage. 💭🔥#MohammedSiraj opens up about his surprise call-up just 24 hours before the opener, SKY asking him to pack his bags, and how faith in God’s plan powered his comeback—capped off with a 3-wicket haul… pic.twitter.com/nsN1IH2N7D
— Star Sports (@StarSportsIndia) February 8, 2026
ముంబైకి విమానంలో వస్తుంటే.. నేను వరల్డ్‌కప్ ఆడడమా.. ఇది కలా? నిజమా? అనిపించింది. ఎందుకుంటే.. ఏడాదిగా వరల్డ్‌కప్ కోసం అందరూ కష్టపడుతున్నారు. నాకు అవకాశం రాదులే అనుకున్నా. అయితే.. రెండు రోజుల క్రితం స్ట్రెంత్ కండీషనింగ్ కోచ్ అడ్రియాన్ లె రౌక్స్ మెసేజ్ చేసి నీ ప్రణాళికలు ఏంటీ? అని అడిగాడు. అప్పటికే రంజీ ట్రోఫీలో నాలుగు రోజులు ఆడిన నేను విశ్రాంతి తీసుకుంటున్నా. సో.. అతడికి రిప్లయ్ ఇవ్వలేదు. కాసేపటికే సూర్యభాయ్ ఫోన్ చేశాడు. మియా.. నీ వస్తువులు బ్యాగులో సర్దుకో.. వచ్చి స్క్వాడ్‌లో చేరు అని నాతో అన్నాడు. మొదట నేను అతడి మాటల్ని సీరియస్‌గా తీసుకోలే. జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. స్వదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడాలనేది నా కల. దేవుడు నాకది రాసి పెట్టాడు. అందుకనే నేను ఇక్కడ ఉన్నాను అని మీడియా సమావేశంలో సిరాజ్ వెల్లడించాడు.
🚨 MOHAMMED SIRAJ ON T20 WC CALL-UP 🚨
He said – “I got Surya’s call yesterday — he said, ‘Miyan, pack your bags & join the squad.’
I told Surya bhai don’t joke with me… I thought he wasn’t serious.
It’s my dream to play a T20 World Cup at home.”🔥pic.twitter.com/p0NbqXt5zK
— Sam (@Cricsam01) February 8, 2026
వరల్డ్‌కప్‌లో టీమిండియాకు అస్త్రం మాదిరిగా పనికొస్తాడనుకున్న హర్షిత్ రానా అనూహ్యంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ అనంతరం మోకాలి గాయంతో ఇబ్బంది పడిన అతడు.. ఫిజియో సూచనతో వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. దాంతో.. అనుభవజ్ఞుడైన సిరాజ్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. అయితే.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉండగా సిరాజ్ బెంచ్మీదనే ఉంటాడనుకున్నారంతా. కానీ, బుమ్రా సైతం గాయపడగా తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై మియా భాయ్‌కు అవకాశం దక్కింది. తనపై నమ్మకంతో పిలిచిని కెప్టెన్ సూర్యకుమార్ నమ్మకాన్ని నిలబెడుతూ తన మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడీ పేసర్.
Mohammad Siraj used to be India’s all-format bowler, but I don’t know why he suddenly got sidelined by Gautam Gambhir for Harshit Rana. Now he got the chance when Harshit got injured, and he picked 2 wickets against the USA in the first 2 overs. 🗿
— Tejash (@Tejashyyyyy) February 7, 2026
ఓపెనర్ అండ్రీస్ గౌస్(6)ను ఔట్ చేసి బ్రేకివ్వగా.. అర్ష్‌దీప్ ఓవర్లో మొనాంక్ పటేల్(0) శివం దూబే చేతికి చిక్కాడు. కాసేపటికే సాయితేజ ముక్కనపల్లి(2)ని సిరాజ్ ఔట్ చేసి మూడో వికెట్ అందించాడు. అంతే.. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది అమెరికా. సంజయ్, మిలింద్ కుమార్‌లు పోరాడినా సరిపోలే. ఆఖరి ఓవర్లో శుభమ్ రంజనే(37) వికెట్ తీసిన సిరాజ్ చక్కని బౌలింగ్(3-29)తో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.