జనగామ రూరల్ మార్చి 18: మామూనూరు ఎయిర్ పోర్టుకు, జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య(Doddi Komuraiah) పేరు పెట్టాలని జనగామ మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షులు బండ ప్రభాకర్ కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3న హైదరాబాద్ రవీంద్రభారతీలో జరగబోయే దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆ మహానీయుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాటం చేసి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని తెలిపారు. జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టకుంటే కురుమ కులస్తులు ఏకమై మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు.