లింగాల గణపురం : తనకు అక్షరాలు నేర్పి ప్రయోజకుడిని చేసిన పాఠశాలకు ఆ విద్యార్థి తన వంతు సహాయం అందించాలని తలచాడు. అనుకున్నదే తడవుగా ఆ పూర్వ విద్యార్థి పాఠశాలలో తన సొంత డబ్బులతో వంట గదిని(Kitchen room) నర్మించాడు. వివరాల్లోకి వెళ్తే..లింగాల గణపురం హైస్కూల్లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థి రవి తనకు తోచినంత సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. హైస్కూల్లో వంటగదిలేక పడుతున్న ఇబ్బందులను గమనించాడు.
తాను సొంతంగా ఖర్చు భరించి వంటగదిని నిర్మించాడు. ఈ పాఠశాలను రవి తల్లిదండ్రులు పద్మ, భిక్షపతి చేతుల మీదుగాఈ నెల 7న ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను, చదువుకున్న బడిని మరవ కుండా తనకు చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చిన రవిని లింగాల గణపురం ప్రజలు అభినందిస్తున్నారు. కాగా, రవి 2009- 2010లో లింగాపురం హైస్కూల్లో విద్యనభ్యసించాడు.