నర్మెట మార్చి 30 : ఉగాది పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పోచమ్మ గుడి మర్రిచెట్టు వద్ద జడ కొప్పులపులాటను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్కకు 22 రంద్రాలు చేసి వాటి గుండా తాళ్లను వేలాడతీసి ఆ కర్రను చెట్టుకు వేలాడదీసి 22 మంది యువకులు కోలాటం ఆడుతూ తాడును జడ కొప్పుగా అల్లి తిరిగి అదే ఆటతో ఆ జడను విడదీయడమే విశేషం.
గత 30 సంవత్సరాలుగా ఆచారలో భాగంగా ఆనవాయితీగా వస్తున్న ఆటను ఉగాది రోజు యువత నిర్వహించారు. గోల్కొండ చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జడ కొప్పులాటలో కాంగ్రెస్ డిసిసి ఉపఅధ్యక్షుడు గంగం నరసింహారెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, పులి కనకయ్య, కొలెపాక అంజయ్య, సురేష్ మహేష్, నవీన్ , అరవింద్, శ్రావణ్, మల్లయ్య, ఎల్లయ్య ,సురేష్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.