తరిగొప్పుల : జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో దుర్గమ్మ గుడి ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆదివారం ఉదయం అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాతా బాలయ్య ఆధ్వర్యంలో దళిత నాయకులు, గ్రామస్తులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ఆలోచన విధానాలే ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలని అని తెలిపారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ కృషి ఎంతో ఉందన్నారు.
ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ కార్యక్రమంలో దళితులు చింతల ఎల్లయ్య, చింతల రమేష్, చింతల బాబు, ఖాతా బాలయ్య, ఖాతా సందీప్, చింతల సుధాకర్, పరుశరాములు, బాల కిష్టయ్య , వెంకన్న, తుర్కపల్లి ఆనందం, విజయ, భోగ శీను, ఉప సర్పంచ్ భాష బోయిన రాజు, మాజీ ఎంపిటిసి తాళ్లపల్లి రాజేశ్వర్, నీల సంపత్, మూలా ఆనందం, మూల రాములు, నీల రాజు అర్జుల సంపత్, మూల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.