Janagaon | జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కోమల గ్రామానికి చెందిన అలావత్ బాలాజీ (49) తన కుమారుడు నరేశ్‌తో కలిసి సోమవారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్‌పై రాఘవపురం బయల్దేరాడు. ఈ క్రమంలో హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మరణించాడు. నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది గమనించి స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు వచ్చిన సిబ్బంది నరేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.