లింగాల ఘణపురం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల(Farmers) కష్టాలు రెట్టింపవుతున్నాయి. సాగు, తాగు నీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మండలంలోని చెరువులలో నీళ్లు లేక భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో బోర్లు, వ్యవసాయ బావుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. రైతులు పరిస్థితులను గమనించి వరి సాగు విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించారు. అయినప్పటికీ నీళ్లు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నారు.
కొంతమంది రైతులు వరికి నీళ్లు అందించేందుకు ట్యాంకర్ల ద్వారా అందిస్తూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. బండ్లగూడలోని రైతు వెంకట్ రెడ్డి తన వ్యవసాయ బావిలో నీరు అడుగంటిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీళ్లను తీసుకొచ్చి పొలానికి అందిస్తున్నాడు. ట్యాంకర్ల నీళ్లను 500 రూపాయలు వెచ్చించి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి కాలువల ద్వారా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.