లింగాలఘణపురం: జనగామ (Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాచుపల్లి కోటయ్య (44).. కుందారం నుంచి అప్పిరెడ్డిపల్లికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.