నర్మెట : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహాకారంతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అందించారు. మల్కపేట గ్రామానికి చెందిన రాములుకు రూ. 53వేలు, ఇసుకబాయితండాకు చెందిన లతకు రూ. 20వేలు, కన్నెబోయిన గూడెంకు చెందిన సుభద్రకు రూ. 20వేలు, అమ్మాపురానికి చెందిన రేణుకకు రూ. 36వేలు, మొత్తం రూ. 1.29 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కో-అప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి పాల్గొన్నారు.