లింగాలఘనపురం: బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నారు. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన గులాబీ పార్టీ రజతోత్సవ సంబురాలకు లక్షలాది మంది తరలిరానున్నారు. కేసీఆర్ స్పీచ్ వినేందుకు పల్లె నుంచి పట్నం వరకు సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనాలను పెద్దఎత్తున సమీకరించేందుకు పార్టీ నాయకులు గ్రామగ్రామాన తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లింగాల ఘనపురం (Lingala Ghanpur) తాజా మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రజతోత్సవ సభకు రావాలంటూ మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. సభ ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు. సభకు హాజరు కావాల్సిన ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు.