చిన్నగూడూరు, డిసెంబర్ 29: ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదల ఆశాజ్యోతిగా నిలిచారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మండల పరిధి ఉగ్గంపల్లిలోని తన నివాసంలో డోర్నకల్, మరిపెడ, కురవి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. డోర్నకల్ మండలం సిగ్నల్ండాకు చెందిన బీ బాలుకు రూ.20వేలు, ముల్కలపల్లికి చెందిన భాస్కర్‌రావుకు రూ.60వేలు, సీతలతండాకు చెందిన ప్రియాంకాకురూ.20వేలు, ఓల్డ్ డోర్నకల్‌కు చెందిన స్వప్నకు రూ.25వేలు, లతకు రూ.60వేలు, మరిపెడ మండలం తానంచర్లకు చెందిన ఎం గణేశ్‌కు రూ.32వేలు, కురవి మండలం కాంపెల్లికి చెందిన టీ వెంకన్నకు రూ. 35వేలు మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ఫలితంగా వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా నాయకుడు ఆయూబ్ పాషా, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు పలువురి పరామర్శ
మోకాలికి శస్త్రచికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు, జిల్లా పాత్రికేయులు గురువారం పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు పిచ్చిరెడ్డి, రవికుమార్, పాత్రికేయులు, లచ్చయ్య, తిరుమలరావు, ప్రసాద్, చిట్టిబాబు, కిరణ్, సహదేవ్, శ్రీనివాస్, ఉపేందర్, సంజీవ, అశోక్, శ్రావణ్, సంపత్, దాసన్న ఉన్నారు.