బచ్చన్నపేట, మార్చి 26 : బచ్చన్నపేట మండల కేంద్రం అంగడి (సంత) వేలం పాటలు బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతల వేలం పాట పంచాయతీ కార్యదర్శి నరసింహ చారి అధ్యక్షతన నిర్వహించగా పశువుల సంత వేలాన్ని రూ.5,18,000 కు గాను మంచాల వినయ్ దక్కించుకున్నారు.
తై బజార్ వేలం పాటను రూ.2,55 ,000 కు గాను దేవిని నాగేష్ దక్కించుకున్నారు. డక్కా వేలం పాటను రూ.27,000 కు గాను మంచాల వివేక్ దక్కించుకున్నారు. ఈ వేలంపాట హక్కుదారులుగా ఏప్రిల్ ఒకటి నుండి 31-03- 2026 వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, పీఏసీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర, కార్యదర్శి నరసింహచారి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.