హైదరాబాద్ : జనగామ జిల్లాలో(Janagama) విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి భార్య, భర్తలు( Couple committed suicide ) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి,లక్ష్మి దంపతులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
జీవితంపై విరక్తి చెందిన వారు పురుగుల మందుతాగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రామ్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.